- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదా వేయాల్సిందే.. సీఎంపై ఆర్ఎస్‌పీ సీరియస్
దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ కార్మికుల బిల్లు వ్యవహరంలో రాజ్ భవన్ ముట్టడికి ముఖ్యమంత్రి పంపించారు.. గన్ పార్క్ వద్ద శాంతి యుతంగా ధర్నా చేపడుతుంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. అంటే రాజ్ భవన్ వద్ద ఒక రూల్.. ఇక్కడ ఒక రూలా..? అని నిలదీశారు. శనివారం గృహనిర్భంధంలో ఉన్న ఆర్ఎస్పీ తన నివాసంలోనే సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు ఆయన సత్యాగ్రహ దీక్షను ముగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేడు ముఖ్యమంత్రి పోలీసులను నమ్ముకొని తెలంగాణను జైలులా మార్చాలని ఆరోపించారు.
సీఎంను కూడా ఫాం హౌస్‌లో నిర్బంధించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. గ్రూప్-2 అభ్యర్థులు గత నెల రోజులుగా వాయిదా వేయాలని అడుగుతున్నారని, కానీ ప్రభుత్వం ఆ కారణాలు వినడానికి సిద్ధంగా లేదన్నారు. గ్రూప్-2 వాయిదా వేయడం లేదంటే పోస్టులన్నీ కల్వకుంట్ల కుటుంబం అమ్ముకుందని నిరుద్యోగులు అనుకుంటున్నారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ కుంభకోణంపై ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడలేదని అన్నారు. గ్రూప్-2 ఎగ్జామ్-3 నెలలు వాయిదా వేయాలని, ఈ పోరాటం తప్పనిసరిగా కొనసాగుతుందని హెచ్చరించారు.