- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుబంధును కాంగ్రెస్ ఆపలేదు.. బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు షాకింగ్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో: రైతుబంధు నిధుల పంపిణీకి తొలుత పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు అర్థంతరంగా ఆపివేసేలా ఉత్తర్వులు జారీ కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాద్‌నగర్ ప్రజా ఆశీర్వాద సభలో వ్యాఖ్యానించారు. రైతుబంధును పొందుతున్న లబ్ధిదారుల్లో కాంగ్రెస్‌కు చెందినవారు కూడా ఉన్నారు గదా.. అది ఆగిపోతే వారు కూడా నష్టపోతారు గదా.. అంటూ వ్యాఖ్యానించారు. కానీ బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడారు. రైతుబంధు ఆగిపోవడం వెనక కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదని అన్నారు. ఆ పార్టీ వల్లనే ఆగిపోయిందని తాను అనడంలేదని వ్యాఖ్యానించారు. సీఈఓ వికాస్‌రాజ్‌ను కలిసిన తర్వాత కేకే పై వ్యాఖ్యలు చేశారు.
రైతుబంధు నిధుల విడుదలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈసీ విధించిన నిబంధనలకు ఎవరైనా విరుద్ధంగా మాట్లాడితే వారికి నోటీసులు ఇవ్వాలి (పరోక్షంగా మంత్రి హరీశ్‌రావు కామెంట్లను ప్రస్తావిస్తూ)గానీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం సమంజసం కాదని కేశవరావు అన్నారు. రైతుబంధు ఆన్-గోయింగ్ స్కీమ్ అయినప్పుడు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా నిధుల పంపిణీ ప్రక్రియకు ఎలా బ్రేక్ వేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలోని ఈసీ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని, రేపటి (మంగళవారం)కల్లా ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా చూస్తామన్నారు. లేదంటే రైతులు అర్థం చేసుకుని రెండు మూడు రోజులు ఓపిక పట్టాలన్నారు. ఇప్పటికిప్పుడు కోర్టుకు వెళ్ళే టైమ్ లేదన్నారు.
సీఈఓను కలిసి సమర్పించిన మెమొరాండంలో మాత్రం హరీశ్‌రావు ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని కేశవరావు వివరణ ఇచ్చారు. రైతుబంధు నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో కృతజ్ఞతాపూర్వకంగా మాత్రమే ఆ అంశాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు. రైతుబంధును ఆపేయించి రైతుల నోట్లో కాంగ్రెస్ పార్టీ మట్టి కొట్టిందని, దీనికి ఓట్లతోనే బుద్ధి చెప్పాలంటూ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేసిన టైమ్‌లో ఈసీ నిర్ణయం వెనక కాంగ్రెస్ హస్తం లేదంటూ కేశవరావు క్లారిటీ ఇవ్వడం గమనార్హం. ఒకసారి ఇచ్చిన ఉత్తర్వులను ఈసీ గతంలో ఎప్పుడూ వెనక్కు తీసుకోలేదంటూ సీఈఓ కూడా ఆశ్చర్యపోయినట్లు కేకే వివరించారు.