MLC Kalvakuntla Kavitha : కవిత ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ

by GSrikanth |   ( Updated:2023-08-21 06:11:12.0  )
MLC Kalvakuntla Kavitha : కవిత ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆశావాహులతో ఎమ్మెల్సీ కవిత ఇంటిదగ్గర సందడి నెలకొంది. టికెట్లు కేటాయిస్తారని ప్రచారంతో పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకుంటున్నారు. తనకు టికెట్ కేటాయించేలా చూడాలని.. నియోజకవర్గంలో తనకే ప్రజల మద్దతు ఉందని వివరిస్తున్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్నానని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని తనకు టికెట్ ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని.. అందుకు తమరి ఆశీర్వాదం కావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. దీంతో గత రెండు మూడు రోజులుగా కవిత నివాసం వద్ద ఎమ్మెల్యేలు, ఆశావాహులతో సందడి నెలకొంది.

తొలి విడత జాబితా రిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్సీ కవిత ఇంటికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టికెట్ ఆశిస్తున్న నేతలు ఎవరికివారుగా చేరుకుంటున్నారు. ఎమ్మెల్సీ నివాసానికి సోమవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, వైరా ఎమ్మెల్యే రాముల నాయక్ కుమారుడు జీవన్ లాల్, నర్సాపూర్ టికెట్ ఆశిస్తున్న సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, మాజీ మేయర్ వంతు రామ్మోహన్ తదితర నేతలు కవితను కలిశారు. ఆశీర్వాదం తీసుకున్నారు. తనకే టికెట్ వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు విశ్వాసునిగా సమాచారం.

అభ్యర్థుల్లో కవిత మార్క్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కవిత తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి తన టీం ఉండాలని భావిస్తు పావులు కలుపుతున్నారు. సుమారు 30 మంది అభ్యర్థులపైగా వచ్చే అసెంబ్లీలో ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అభ్యర్థుల తొలి లిస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది..

Read More : టికెట్ రాదని తెలిసి హుటాహుటిన ఆమె వద్దకు రేఖా నాయక్!

Advertisement

Next Story