- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆయన్ను సీఎం చేయాలని కాంగ్రెస్‌ను ఒప్పించింది కేసీఆరే’
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గురువారం లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని చెప్పారు. కుమారస్వామి ముఖ్యమంత్రి అవ్వడానికి కాంగ్రెస్‌ను ఒప్పించింది కేసీఆరే అని వెల్లడించారు. అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వ బిల్లులను కాంగ్రెస్‌తో కలిసి బీఆర్ఎస్ అడ్డుకుందని గుర్తుచేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యన ఉన్న రసహ్య ఒప్పందం గురించి ప్రజలకు తెలిసి పోయిందన్నారు.
తెలంగాణలో పేదలకు ఇళ్లు నిర్మించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆరోపించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించలేకపోయిందని దుయ్యబట్టారు. కేసీఆర్ రైతులను సైతం దగా చేస్తున్నారని, మాయమాటలతో మోసగిస్తున్నారని విమర్శించారు. సొంత రాష్ట్రంలోనే రైతులకు ఏమీ చేయలేకపోయిన వ్యక్తి ఇప్పుడు దేశవ్యాప్త రైతాంగం కోసం పోరాడతానంటూ పార్టీ పేరు మార్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా అవుతుందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వైపు ఒక్కరూ కూడా కన్నెత్తి చూడలేదని అన్నారు.