Bandla Ganesh : ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

by GSrikanth |   ( Updated:2023-10-09 10:35:53.0  )
Bandla Ganesh : ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈసారి జరిగే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కూకట్‌పల్లి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా ఇవాళ స్పందించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనకు ఇప్పుడు అవకాశం ఇస్తానని చెప్పారని గుర్తుచేశారు. తనకు ఈసారి టికెట్ వద్దని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం దానికోసం పనిచేస్తానని వెల్లడించారు. ‘రేవంతన్న ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం. తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం, అధికారంలోకి వస్తాం జై కాంగ్రెస్’ అంటూ రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేశారు.

Advertisement

Next Story