- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీలకు ‘శ్రావణ’ గండం.. ఎవరు ఝలక్ ఇస్తారో తెలియక మూడు పార్టీల్లో టెన్షన్!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని రాజకీయ పార్టీలకు శ్రావణ మాసం టెన్షన్ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం అన్ని పార్టీల్లో పెద్ద ఎత్తున నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ దక్కకుంటే పార్టీ మారేందుకు ఆశావహులు రెడీ అవుతున్నారు. ఆషాడ మాసం కారణంగా అటువైపు నుంచి ఆఫర్లు వచ్చినా పార్టీలు మారేందుకు నేతలు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో రాష్ట్రంలో చేరికల పర్వానికి కాస్త బ్రేకులు పడ్డాయి. అయితే ఎల్లుండి నుంచి ఆషాడం ముగియనుంది. మంగళవారం నుంచి శ్రావణ మాసం మొదలుకానుంది. దీంతో ఎన్నికలకు ముంగిట్లో ఏ నేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే టెన్షన్ పార్టీలను కలవరపెడుతున్నది. ఎన్నికలకు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో టికెట్ విషయంలో పార్టీ పెద్దలపై నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. ఏదో ఒకటి తేల్చాలని పట్టు పడుతున్నారు. హామీ లభిస్తేనే పార్టీలో కొనసాగడం లేకుంటే కండువా మార్చాలనే ప్లాన్‌తో ఉన్నారు. తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. దీంతో అన్ని పార్టీలకు శ్రావణ మాసం సవాల్‌గా మారబోతున్నదనే చర్చ జరుగుతున్నది.
ప్రామిస్ లేకుంటే పార్టీ మారుడే..
ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. గెలుపు గుర్రాల కోసం పార్టీలు అన్వేషణ మొదలు పెట్టాయి. రకరకాల సర్వేలతో అభ్యర్థుల ఎంపిక కసరత్తుకు పదును పెడుతున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న కేసీఆర్‌కు పార్టీ ఎమ్మెల్యేల అవినీతి బాగోతాలు ఆందోళన కలిగిస్తుంటే.. కర్నాటక ఫలితాలతో కాంగ్రెస్ గ్రాఫ్ మెరుగుపడింది. ఇక బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని భావించిన బీజేపీ ప్రస్తుతం స్థబ్దుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీలకు టికెట్లు ఇవ్వకూడదని కేసీఆర్ యోచిస్తున్నారనే టాక్. అధినేత కనికరించకుండే కండువా మార్చాలనే యోచనలో ఉన్నారని ఈ మేరకు ఇప్పటికే ఇతర పార్టీలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తున్నది. ఇక రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో అధిష్టానం నిర్ణయంపై పలువురు బీజేపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. త్వరలోనే వారంతా ప్రత్యామ్నాయాన్ని చూసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇక జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌లోకి చేరికలతో కొత్త, పాత నేతల మధ్య చిచ్చు మొదలైంది. దీంతో ఏమాత్రం తేడా కొట్టినా పక్క పార్టీలో జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
జంపింగ్ లిస్ట్ పెద్దదే!
పార్టీకి ఝలక్ ఇచ్చే నేతలు బీఆర్ఎస్‌లోనే ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్‌లో ఉద్యమకాలు, సీనియర్లను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేసీఆర్, కేటీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెతున్నాయి. దీంతో ఇక అధినేతను నమ్ముకుంటే ప్రయోజనం లేదని భావిస్తున్న పలువురు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ నేత పొంగులేటి ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోగా జూపల్లి త్వరలోనే కాంగ్రెస్ కండువా కొప్పుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ సైతం హస్తం కండువాతోనే దర్శనం ఇస్తున్నారు. ఎమ్మెల్సీలకు టికెట్ కష్టమే అని సీఎం ప్రకటనతో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సైతం ఆలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతున్నది. సొంత పార్టీలోనే తనపై కుట్ర చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు సంచలన వ్యాఖ్యలు చేయడంతో తేడా వస్తే ఆయన సైతం పార్టీ మారుతారనే టాక్ వినిపిస్తున్నది. ఇక బీజేపీ విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏ.చంద్రశేఖర్, విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు,రాజాసింగ్ పార్టీ మారుతారనే ఊహాగానాలు కొంతకాలంగా గుప్పుమంటున్నాయి. దీంతో ఈ శ్రావణ మాసంలో జంపింగ్ గండాలను ఎలా అడ్డుకోవాలన్నది పార్టీలకు సవాల్‌గా మారిందనే చర్చ జరుగుతున్నది.