CEO వికాస్ రాజ్‌ను కలిసిన వీహెచ్‌పీ నేతలు

by GSrikanth |
CEO వికాస్ రాజ్‌ను కలిసిన వీహెచ్‌పీ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను విశ్వ హిందూ పరిషత్(VHP) బృందం కలిసింది. బతుకమ్మ పండుగ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు. ఆడపడుచులంతా సంబురంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ అని చెప్పారు. పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story