హైదరాబాద్‌ మెట్రోలో అనూహ్య పరిస్థితి (వీడియో)

by GSrikanth |
హైదరాబాద్‌ మెట్రోలో అనూహ్య పరిస్థితి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ ప్రజలంతా ఓటేయడానికి గ్రామాలకు తరలి వెళ్లడంతో మహానగరం బోసిపోయింది. ముఖ్యంగా రోజూ కిక్కిరిసిపోయే హైదరాబాద్‌ మెట్రో అనూహ్య పరిస్థితి నెలకొంది. కరోనా తర్వాత మొదటిసారి ఖాళీ ట్రైన్లు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35,655 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 3.26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు దాదాపు లక్ష మంది రాష్ట్ర పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed