- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. నేటి నుంచే రంగంలోకి!
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పై కసరత్తు వేగవంతమైంది. పార్టీ మేనిఫెస్టోలో ప్రజల నుంచే అంశాలను సేకరించనున్నారు. పది రోజుల పాటు పది జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రాల్లో వినతులు స్వీకరించనున్నారు. ప్రజా సంఘాలు, ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి అంశాలను సేకరించనున్నారు. మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు సూచన మేరకు కమిటీ సభ్యులు అన్ని జిల్లాలను కవర్ చేసేలా ప్లాన్ చేశారు. సోమవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది.
ఈరోజు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో మేనిఫెస్టో కమిటీ పర్యటించనున్నది. ఆయా జిల్లాల నుంచి వచ్చిన కీలక అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఆ తర్వాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనూ మేనిఫెస్టో కమిటీ పర్యటించనున్నదని ఈ కమిటీ సభ్యులు ఒకరు తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు... మిగతావి ఫేజ్ ల్లో.. అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను మేనిఫెస్టో కమిటీ ఫిల్టర్ చేయనున్నది. కామన్ గా వచ్చిన అంశాలను ప్రియారిటీగా తీసుకొని కమిటీలో చర్చించనున్నది. మెజార్టీ సభ్యుల ఆమోదం తర్వాత టీపీసీసీలో డిస్కషన్ జరుగుతుంది.
ఆ తర్వాత ఆయా అంశాలు మేనిఫెస్టోకి ఎంపిక అవుతాయి. దీంతో పాటు నిరుద్యోగులు, రైతులు, యువత సమస్యలకు శాశ్వత పరిష్కారం మార్గాలను మ్యానిఫెస్టోలో పొందుపరుస్తారు. అయితే కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన మహలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత, వంటి స్కీమ్ లను మాత్రం పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇంప్లిమెంట్ చేయనుండగా.. మేనిఫెస్టోలోని అంశాలను ఫేజ్‌లు వారీగా అమలు చేయనున్నారు.