- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిబంధలు ఉల్లంఘించిన టీ.బీజేపీ.. బహిష్కరించిన ఎమ్మెల్యేకు పార్టీ ఆహ్వానం!
దిశ, తెలంగాణ బ్యూరో: సంప్రదాయాలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీ బీజేపీ.. అలాంటి ది ఆ పార్టీ నేతలే కట్టుతప్పుతున్నారా? సిద్ధాంతాలను పట్టించుకోవడం లేదా? అంటే అవున నే సమాధానమే వస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో పలువురు నేతలు ఇలాంటి తప్పిదమే చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయనపై జాతీయ నాయకత్వం సస్పెన్షన్ విధిస్తే.. పార్టీ నేతలు మాత్రం సమావేశానికి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు ఆహ్వానించారా? లేక రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఆహ్వానించారా? లేక స్థానిక నేతలెవరైనా అత్యుత్సాహం ప్రదర్శించారా? అనేది అంతుచిక్కడంలేదు.
14 నెలలుగా సస్పెన్షన్
గత సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఏకైక స్థానం గోషామహల్. పార్టీలో సీనియర్ నేతగా రాజాసింగ్ పేరు తెచ్చుకున్నారు. అయితే వివాదాలకు కేరాఫ్‌గా నిలవడంతో ఆయనపై పార్టీ వేటు వేసింది. నగరంలో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూక్ షో ఏర్పాటు నేపథ్యంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు దీన్ని తప్పుపట్టడంతో బీజేపీ రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. కాగా తాజాగా రాజస్థాన్‌లో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సైతం కలకలం రేపాయి. లవ్ జిహాద్ పేరిట ముస్లిములు హిందూ యువతులను ట్రాప్ చేస్తున్నారని, ఇక నుంచి అలా జరగకుండా హిందువులు కూడా.. పాకిస్తాన్ ముస్లిం యువతులను ట్రాప్ చేసి ఇక్కడికి తీసుకురావాలని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కేసు నమోదైనట్లు సమాచారం. పార్టీ నుంచి సస్పెండ్ చేసి 14 నెలలు గడిచింది. ఎన్నికలకు కేవలం 45 రోజులు కూడా లేవు. అయినా ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయలేదు.
మీటింగ్‌కు హాజరయ్యేనా?
రాజాసింగ్‌ను గోషామహల్ సెగ్మెంట్ విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకావాలని ఇన్విటేషన్ అందించమన్నది ఎవరనేది అర్థం కావడంలేదు. ఒకవేళ జాతీయ పార్టీయే ఆహ్వానం అందించాలని ఆదేశిస్తే.. ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటించేది. అదే రాష్ట్ర పార్టీ అయినా ఇవే రూల్స్ వర్తిస్తాయి. మరి స్థానిక నేతలు ఎవరైనా చేశారా అనుకుంటే పైనున్న పెద్దల ఆశీర్వాదం లేకుండా వారెలా ఆహ్వానిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఇన్విటేషన్ అంశం జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలకు తెలిసి జరిగిందా? లేక తెలియకుండా ఎవరైనా చేశారా? అనేది సస్పెన్స్‌గా మారింది.
ఎందుకంటే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ థావ్ డే, పార్టీ సీనియర్ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సైతం హాజరవుతున్నారు. ఈ స్థాయి లీడర్లు వస్తున్నారంటే రాష్ట్ర పార్టీకి ఎలా తెలియకుండా ఉంటుందనే వారూ లేకపోలేదు. పార్టీ లైన్ దాటి సస్పెండ్ అయిన నేతను ఎలా ఆహ్వానిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేసి పార్టీ ప్రతిష్టను పెంచుతారా? దిగజార్చుతారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సస్పెన్షన్ ఎత్తివేయకున్నా రాజాసింగ్‌ను ఆహ్వానితుడిగా పేర్కొన్నారు. తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయకుండా రాజాసింగ్ ఈ మీటింగ్‌కు హాజరవుతారా? లేదా? అన్నది చూడాలి.