- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌పై దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి గర్హనీయమని, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో శవరాజకీయాలకు కేసీఆర్ పాల్పడుతున్నారని ఆరోపించారు. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత బురదజల్లే ప్రయత్నం చేశారని, కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తికి తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళితబంధు, గృహలక్ష్మి సాయం అందలేదంటూ వార్తలు వస్తున్నాయని, దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలంటే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
దాడికి పాల్పడిన రాజు 2018లో నాగేశ్వరరావుతో దిగిన ఫొటోలు ఉన్నాయని, 2020లో ప్రెస్ రిపోర్టర్‌గా ఉన్నారని శ్రీనివాసరెడ్డి గుర్తుచేశారు. గాయపడిన ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని సిద్దిపేటలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించడానికి బదులుగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించడంపై అనుమానం వ్యక్తం చేశారు. యశోద ఆస్పత్రి బీఆర్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్నదని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడినప్పుడు రాజు మద్యం సేవించి ఉన్నాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చూపిస్తున్న ఫొటోలోని వ్యక్తి (నిందితుడు రాజు పేరుతో) కాంగ్రెస్‌లో లేరని, బీఆర్ఎస్‌లోనే ఉన్నారని చెరుకు శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.