- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యూహాత్మకంగానే వివాదం.. నాగార్జున సాగర్ ఇష్యూపై రేవంత్ రియాక్షన్
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు రాగా.. తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షన వాతావరణం చోటుచేసుకుంది. తాజాగా.. ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. పోలింగ్‌కు ముందురోజు సెంటిమెంట్‌ను రగిల్చేలా వ్యూహాత్మకంగానే వివాదం సృష్టించారని మండిపడ్డారు.
దీనిపై ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరు? ఎందుకు? ఏం ఆశించి? ఈ ప్రయత్నాలు చేశారో ప్రజలకు తెలుసుని అన్నారు. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుంది. నీళ్లు ఎక్కడికి పోవు. దీనిపై పోలింగ్‌కు ముందు రోజు అర్ధరాత్రి వివాదం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇది కచ్చితంగా కుట్రలో భాగమే అని తెలిపారు. ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించవు అని తేల్చి చెప్పారు.
Read More..
సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు ఏపీతో కలిసి కేసీఆర్ ప్లాన్? (వీడియో)