- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌ను జైలుకు పంపాలి: కోదండరాం
దిశ, డైనమిక్ బ్యూరో: డిజైన్, క్వాలిటీ లేక కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందని, ఈ ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్‌ను జైలుకు పంపాలని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘కుంగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్‌లకు పరిష్కార మార్గాలు ఏమిటి?’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అటు ప్రజల్లో, ఇటు రాజకీయ పార్టీల్లో ఎన్నో అనుమానాలున్నాయని, ఆ వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని, లేదంటే లేదంటే మేమే బయటపెడతామని హెచ్చరించారు.
రాష్ట్రంలో అధికార దుర్వినియోగానికి ప్రాజెక్టు సాక్ష్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ బయట పెట్టాలని, ప్రాజెక్టు అధ్భుతాలపై రాష్ట్ర ప్రభుత్వం తన ప్రగల్భాలు ఆపాలన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టులు దృఢంగా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైంది..? అధికార దుర్వినియోగం కారణంగా కనిపిస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.