- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమ్మె చేసేవారితో కాకుండా వారితో మాట్లాడి ప్రయోజనమేంటి?
దిశ, డైనమిక్ బ్యూరో: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్, కురవి మండల కేంద్రంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరవధిక సమ్మెకు ప్రొఫెసర్ కోదండరామ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 14 రోజులుగా దీక్ష చేస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, గ్రాట్యుటీ అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు లాంటి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయవచ్చని తెలిపారు. కనీసం వేతనం కాంట్రాక్టు ఉద్యోగులకు ఇవ్వాలని బిస్వాల్ కమిటీ ఈ విషయం స్పష్టం చేసిందన్నారు. ఇవన్నీ ఉన్న కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఇవి స్కీమ్ పోస్టులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని చూపిస్తోందని, కేంద్రం రాష్ట్రానికి చూపిస్తోందని విమర్శించారు. కానీ, ఈ విషయాలపై ఇరువురు ఒక నిర్ణయానికి రావడం లేదని, అందుకే నేడు అంగన్వాడీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఇప్పుడు ఇస్తున్న జీతాలు కూడా అంగన్వాడీల పోరాట ఫలితమేనని ఎవరు కూడా దయతలిచి ఇచ్చింది కాదన్నారు. సమ్మె చేసేవారితో మాట్లాడకుండా వేరేవారితో ప్రభుత్వం మాట్లాడితే లాభం లేదన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రతి సారి హుంకరిస్తాదన్నారు. అంగన్వాడీలతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.