- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కటైన కడియం, రాజయ్య.. కీలక హామీ ఇచ్చిన కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ బీఆర్‌ఎస్ టికెట్ కేటాయింపు విషయంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య నెలకొన్న పంచాయతీ శుక్రవారం ప్రగతిభవన్ వేదికగా పరిష్కారమైంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్యవర్తిత్వంతో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకొచ్చారు. నేతల నడుమ జరిగిన సంప్రదింపులు, చర్చల అనంతరం కడియం శ్రీహరి ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రకటించారు.
కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని తాటికొండ రాజయ్యకు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. లేకుంటే వరంగల్ ఎంపీగా అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాజయ్య మాత్రం ఎంపీ అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. స్టేషన్ ఘనపూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపు కోసం పనిచేస్తానని రాజయ్య ప్రకటించారు. పార్టీ నిర్ణయం మేరకు తననకు మద్దతు ప్రకటించిన రాజయ్యకు కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. కలిసికట్టుగా పనిచేసి స్టేషన్ ఘనపూర్‌లో పార్టీ జెండా ఎగురవేస్తామని ఆశాభావం ప్రకటించారు.