- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS Elections: తొలి ఓటు వేసిన మంత్రి, మాజీ మంత్రి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏడు గంటలకు అధికారులు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించగా.. నిర్మల్ నియోజకవర్గ అధికార బీఆఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తొలి ఓటు వేశారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ కూడా ఓటు వేశారు. కాగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35,655 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 3.26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు దాదాపు లక్ష మంది రాష్ట్ర పోలీసులు, కేంద్ర పారామిలిటరీ బలగాలు, ఇతర రాష్ట్రాల హోంగార్డులను ఎలక్షన్ కమిషన్ వినియోగిస్తున్నది. సుమారు రెండు లక్షల మందికి పైగా ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల విధుల్లో ఈసీ నియమించింది. ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. అప్పటి వరకు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4.00 గంటలకే ముగియనున్నది. మొత్తం 59,779 ఈవీఎం (బ్యాలట్ యూనిట్ల)లను వినియోగిస్తున్నది.