కేటీఆర్ vs కోమటిరెడ్డి.. స్కామ్ గ్రెస్ కామెంట్స్‌కు కౌంటర్

by GSrikanth |
కేటీఆర్ vs కోమటిరెడ్డి.. స్కామ్ గ్రెస్ కామెంట్స్‌కు కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం కొనసాగుతున్నది. తాజాగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కర్నాటకలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ అక్కడి ప్రభుత్వం బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకు రూ.500 ల చొప్పున పన్ను విధిస్తోందని ఇది ‘రాజకీయ ఎన్నికల పన్ను’ అని అభివర్ణించారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. స్కామ్‌ల వారసత్వంతో స్కామ్ గ్రెస్‌గా మారిపోయిందని ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు.

ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగానే రియాక్ట్ అయిన కోమటిరెడ్డి.. బీఆర్ఎస్ అంటే 'ది లూట్-సూట్ సర్కార్' అని విమర్శించారు. తెలంగాణలో గడిచిన 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమ పార్టీ, తమ కుటుంబం కోసం రూ.1000 కోట్ల 'కే' పన్ను వసూలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఫ్యామిలీ ఫస్ట్, పీపుల్ లాస్ట్ అన్నదే బీఆర్ఎస్ ఎజెండా అని దీనినే గత తొమ్మిదేళ్లుగా అమలు చేస్తోందని కేటీఆర్ వ్యాఖ్యలకు బదులిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed