- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భయపడాల్సిందేం లేదు.. ఫలితాన్ని స్వీకరిద్దాం: KTR
దిశ, వరంగల్ బ్యూరో: ఎన్నికల ఫలితాలపై టెన్షన్ పడాల్సిన పనిలేదని, ప్రజాతీర్పును గౌరవిద్దాం, ఫలితం ఏమొచ్చినా స్వీకరిద్దామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ధైర్యం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులకు స్వయంగా కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. ఫలితాలపై ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పినట్లు సమాచారం. కౌంటింగ్ ప్రక్రియను జాగ్రత్తగా పరిశీలించాలని, వీలును బట్టి హైదరాబాద్‌కు రావాల్సి ఉంటుందని కూడా సూచించినట్లుగా తెలుస్తోంది. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న కొన్ని గంటల ముందు స్వయంగా కేటీఆర్ నుంచి అభ్యర్థులకు ఫోన్లు వచ్చినట్లుగా ముఖ్య నేతల మధ్య జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా మారింది. పోలింగ్ సరళిపైనా అభ్యర్థుల నుంచి మంత్రి ఆరా తీసినట్లు సమాచారం.