వారి పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి: మాణిక్‌రావ్ థాక్రే

by GSrikanth |
వారి పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి: మాణిక్‌రావ్ థాక్రే
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్టులో 50 శాతం అభ్యర్థులను ప్రకటిస్తామని ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. ఫస్ట్ లిస్టు జాబితాలోని అభ్యర్థుల పేర్లన్నీ ఖరారయ్యాన్నారు. మిగిలిన సీట్లపై ప్రస్తుతం కసరత్తు జరుగుతుందన్నారు. వీటిల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది నేతలు పోటీ పడుతున్నారన్నారు.

పార్టీ పట్ల నిబద్ధత, పాపులారిటీ, విజయావకాశాలను కీలకంగా పరిగణలోకి తీసుకుంటామన్నారు. వాటి ఆధారంగానే సీట్లను ఫిక్స్ చేస్తామన్నారు. సీపీఐ నాలుగు సీట్లను అడుగుతుందని, కానీ పార్టీలో ఇంకా ఫైనల్ కాలేదన్నారు. చర్చల దశల్లోనే పొత్తు ఉన్నదన్నారు. మరోవైపు షర్మిల ఇష్యూను నేరుగా ఏఐసీసీ హైకమాండ్ టేకప్ చేసిందన్నారు. అందుకే ఆమె వివిధ కీలక నేతలను కలిసేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story