- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రి కేసీ జార్జ్ కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక రైతులకు అవసరం మేరకు పవర్ ఇస్తున్నామని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కేసీ జార్జ్ పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో కరెంట్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ పాలనలో కొత్త పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయకపోవడంతో పవర్ క్వాలిటీలో కొంత సమస్యలు వచ్చాయి కానీ, పూర్తిగా ఇవ్వడం లేదనేది వాస్తవం కాదన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో 90 శాతం అమలులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో రైతులు కొరినంత కరెంట్ ఇస్తున్నామన్నారు. సీడబ్ల్యూసీ సభ్యులు అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచితంగా అందజేస్తుందన్నారు. కేసీఆర్ 24 గంటల పేరిట దోపిడీకి పాల్పడతున్నాడన్నారు. ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వానికి తెలంగాణ డిస్కమ్స్ 3 వేల కోట్ల రూపాయల బకాయి పడిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.