‘ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవినీతి పరుడే’

by GSrikanth |
‘ప్రతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవినీతి పరుడే’
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రతి ఎమ్మెల్యే అవినీతిపరుడని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఇవాళ ఎర్రగడ్డలో ప్రధాని మోడీ మాన్ కీ బాత్ 107వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ అవినీతిమైందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ రాఫెల్, కామన్వెల్త్, 2జీ, 3జీ పేరుతో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.


కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఏంలా మారిందని విమర్శించారు. ప్రధాని ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లు నిర్మించామని, ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకాన్ని కేసీఆర్ ఇక్కడ అమలు చేయడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని మోసం చేశారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలు అని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక ఉజ్వల యోజన పథకం కింద ప్రతి ఏడాది ఉచితంగా 4 సిలిండర్లు, ఎరువులు సబ్సిడీకి అందిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed