- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో కేటీఆర్ బాత్రూంలు కడిగారన్న ప్రచారం నిజమేనా?
దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయాల్లో మంత్రి కేటీఆర్ ఒక బచ్చా అని మాజీ ఎంపీ రవీందర్ నాయక్ ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ చాయ్ వాలాకు సరిగా పాలించడం లేదంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి ఇష్టారీతిన మాట్లాడారని ఆయన ధ్వజమెత్తారు. మోడీపై కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే గతంలో అమెరికాలో ఆయన బాత్రూంలు కడిగారంటూ జరిగిన ప్రచారం నిజమే అనిపిస్తోందని ఘాటుగా స్పందించారు. ఇకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ దారువాలా అని, ఆయనో రాజకీయ అవినీతిపరుడని ఆరోపణలు చేశారు. ఆయన తెలంగాణ ప్రజలకు ఏం చేశారని రవీందర్ నాయక్ ప్రశ్నించారు. ఎన్నికలు వస్తే కేసీఆర్‌కు కొత్త పథకాలు గుర్తుకు వస్తాయని మండిపడ్డారు. కేసీఆర్ లక్షల కోట్ల అవినీతిపై కేంద్ర నిఘా సంస్థలు, కేంద్ర ఎన్నికల సంఘం నజర్ పెట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డబ్బుతో ఓట్లు కొనేందుకు కేసీఆర్ చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు.
ఇకపోతే సొంత పార్టీకి చెందిన ఎంపీ సోయం బాపురావుపై రవీందర్ నాయక్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాపూరావు.. గిరిజనులకు జరిగే అన్యాయంపై సోయం బాపూరావు పోరాటం చేయాలే తప్పితే.. ఎస్టీ రిజర్వేషన్ల నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని చురకలంటించారు. చట్ట ప్రకారమే లంబాడాలకు రిజర్వేషన్లు అందుతున్నట్లుగా ఆయన చెప్పారు. కొన్ని శక్తులు సోయం బాపూరావును ఆడిస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టులో ఉన్న అంశంపై సోయం బాపూరావు ధర్నా చేయడం అప్రజాస్వామిక చర్యగా ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఇలాంటి చర్యలను సహించదని మండిపడ్డారు.
ఎస్టీ రిజర్వేషన్ల అంశం పార్టీ అభిప్రాయం కాదని, తన వ్యక్తిగతమంటూ బాపూరావు.. చెప్పడాన్ని రవీందర్ నాయక్ తీవ్రంగా ఖండించారు. లంబాడాలను తొలగించాలనే డిమాండ్ బాపూరావు మళ్ళీ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. లంబాడాలు, ఎరుకలు కలిస్తేనే 10 శాతం రిజర్వేషన్లు దక్కాయని, లేకపోతే ఆదివాసీలకు దక్కేది 4 శాతం రిజర్వేషన్లు మాత్రమేనని నొక్కిచెప్పారు. బాపూరావు సామాజికవర్గం ఒక్క ఆదిలాబాద్ లోని 10 నియోజకవర్గాల్లో మాత్రమే ఉందని బాపూరావు చెప్పారు. కానీ లంబాడాలు 90 నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలను నిర్ధేశించే స్థాయిలో ఉన్నారనే విషయాన్ని బాపూరావు గుర్తుపెట్టుకోవాలని రవీందర్ నాయక్ సూచించారు.