వాళ్లకు న్యాయం చేసేలా బీజేపీ మేనిఫెస్టో

by GSrikanth |
వాళ్లకు న్యాయం చేసేలా బీజేపీ మేనిఫెస్టో
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలకు న్యాయం చేకూర్చేలా బీజేపీ మేనిఫెస్టో ఉంటుందని, ఇందుకోసం బీసీ మేనిఫెస్టో డ్రాప్టింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణాలో 60 శాతం బీసీ సామాజికవర్గ ప్రజలే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బీసీ సామాజికవర్గాలు అనేక వృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని బూర తెలిపారు.

వృత్తి సంఘాలు, కుల సంఘాల వారికి న్యాయం జరిగే విధంగా మ్యానిఫెస్టో ఉండబోతోందని స్పష్టంచేశారు. బీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా మేనిఫెస్టో రూపొందించి అధిష్టానానికి అందించనున్నట్లు నర్సయ్య గౌడ్ స్పష్టంచేశారు. విశ్వకర్మ యోజన పథకం బీసీ సామాజికవర్గాలకు ఎంతో ఉపయోగపడుతుందని, తెలంగాణ బీసీ సామాజిక వర్గాలు ఈ పథకాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని బూర నర్సయ్య గౌడ్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed