ప్రగతి భవన్‌కు చేరిన కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
ప్రగతి భవన్‌కు చేరిన కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీట్ల పంపకాల విషయంలో అందరం కలిసిగట్టుగా చర్చించి నిర్ణయం తీసకున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధిష్టానం ఆమోదం కోసం తమ అభ్యర్థుల జాబితా ఢిల్లీకి వెళ్లిందని అన్నారు. మరోవైపు ఆమోదం కోసం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రగతి భవన్‌కు వెళ్లిందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పెద్ద సార్(కేసీఆర్) ఆమోదం కోసం వెయిట్ చేస్తున్నారని, ఆయన ఓకే చెప్పగానే ప్రకటించేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు.

‘పాపం.. రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదు’ అని బండి సంజయ్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని.. చివరకు బకరాలుగా మిగిలేది హరీశ్ రావు, రేవంత్ రెడ్డిలే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్, ఎమ్ఐఎమ్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వ్యక్తిగత స్వలాభం కోసం కాకుండా ప్రజల కోసం, దేశం కోసం పనిచేసే పార్టీలకు అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story