- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆ సినిమా చిచ్చు.. ఉత్కంఠ రేపుతున్న యుద్ధం!
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల షెడ్యూల్‌తో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. గెలుపు కోసం పార్టీల మధ్య అస్త్రశస్త్రాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరుకోగా తాజాగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య సినిమా రాజకీయం సంచలనంగా మారుతున్నది. నిజాం పాలనలో రజాకార్ల అకృత్యాల ఇతివృత్తంగా తెరకెక్కుతున్న 'రజాకార్' మూవీపై మొదటి నుంచి కారు పార్టీ, కమలం పార్టీలో కయ్యం నడుస్తోంది. ఈ మూవీ టార్గెట్‌గా మంత్రి కేటీఆర్ గతంలో విమర్శల బాణాలు ఎక్కుపెట్టగా ఎన్నికల వేళ ఈ సినిమా విషయంలో బీజేపీ డోస్ పెంచడం రెండు పార్టీల మధ్య రాజకీయాన్ని మరింత రక్తికట్టిస్తోంది. తాజాగా రజాకార్ మూవీ నుంచి బతుకమ్మ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేయగా ఆ సాంగ్‌పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటుంటే బీజేపీ వైపు నుంచి అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్లు వస్తున్నాయి. దీంతో మరోసారి ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం ఉత్కంఠ రేపుతున్నది.
కారు, కమలం పార్టీల మధ్య డైలాగ్ వార్!
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రజాకార్ మూవీ చిచ్చు రచ్చ రంబోలగా మారింది. ఈ సినిమా కాంట్రవర్సీ క్రియేట్ చేసేందుకే బీజేపీ ప్రోద్బలంతో వస్తోందని మంత్రి కేటీఆర్ మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 17న ఈ సినిమా టీజర్ విడుదల కాగా దానిపై కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రజాకార్ మూవీ ద్వారా హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఆరిపోయిన గాయాలను మళ్లీ రేపాలని చూస్తోందని తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుతో పాటు పోలీసుల దృష్టికి తీసుకువెళ్తామని వ్యాఖ్యానించారు. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ వెనక్కి తగ్గడం లేదు.
కేటీఆర్ వ్యాఖ్యలపై అంతే ఘాటుగా బదులిస్తూ వస్తోంది. ఇంతలో ఎన్నికల షెడ్యూల్ వెల్లడి కావడం, త్వరలో బతుకుమ్మ వేడుకలు ప్రారంభం కాబోతున్న వేళ సెంటిమెంట్‌ను రెయిజ్ చేస్తూ రజాకార్ మూవీలో నుంచి బతుకమ్మ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
దీంతో ఇప్పుడీ పాట విషయంలో ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియాలో హాట్ హాట్ డిబేట్ సాగుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ పార్టీ బతుకమ్మ పాట ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని, బతుకమ్మను అవమానించేలా స్టెప్స్ ఉన్నాయని కొందరు విమర్శిస్తుంటే అసలు తెలంగాణలో ఈ సినిమా ఎలా రిలీజ్ చేస్తారో చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ వర్గంపై విద్వేషం పెంపొందించేలా ఈ పాటలో లిరిక్స్ ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్న కామెంట్లకు బీజేపీ మద్దతు దారులు అంతే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు. రజాకార్ల ఆకృత్యాల గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే మీకు నొప్పిదేనికంటూ కౌంటర్ ఇస్తున్నారు.
ఎవరికి కలిసి వచ్చేనో:
ప్రస్తుతం రాజకీయంగా అందివచ్చే ఏ అవకాశాన్ని ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలు వదులుకునేందుకు సిద్ధంగా లేవు. ఈ క్రమంలో రజాకార్ మూవీ విషయంలోనూ ఇరు పార్టీల మధ్య జరుగుతున్న పొలిటికల్ డైలాగ్స్ తూటాల్లా పేలుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రపక్షంలో ఉన్నాయి. మిత్ర ద్వయాన్ని బీజేపీ చాలా కాలంగా టార్గెట్ చేస్తోంది. సరిగ్గా ఎన్నికల మూడ్ లో రాష్ట్రం మునిగి తేలుతున్న సమయంలో దసరా పండగ సీజన్ రావడం అందున బతుకమ్మ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయన్న వేళ రజాకార్ ఫైల్స్ నుంచి బతుకమ్మ పాట విడుదల చేయడం వెనుక బీజేపీ పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం నడుస్తున్న ఈ సినిమా పాటిలిక్స్ అంతిమంగా ఎవరికి కలిసి వస్తుందో ఎవరికి నష్టం చేకూరుస్తుందో చూడాలి మరి.