- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తు్న్న ఆదరన చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్‌కు చెందిన కొంత మంది కోవర్డ్ నాయకులు రేవంత్ రెడ్డిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారని అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంజులా రెడ్డి అనే మహిళ నేత సైబర్ క్రైమ్ డీసీపీకి ఫిర్యాదు చేసింది.
రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, కాంగ్రెస్ పార్టీ టికెట్లను రేవంత్ రెడ్డి అమ్ముకుంటున్నారని ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త మనోహర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవే ఆరోపణలు కొంత మంది సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తుండటంపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. కాగా, రేవంత్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ మనోహర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.