- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈసీ హెచ్చరిక లేఖ
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈసీ హెచ్చరిక లేఖ రాసింది. బాధ్యతాయుతమైన పదవి, పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ప్రసంగాలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం తమకు ఉందని గుర్తుచేశారు. ప్రస్తుతం దీనిని సీరియస్‌గా తీసుకోవడం లేదని.. కానీ, భవిష్యత్‌లో తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.
కాగా, దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ దాడి విషయం బాన్సువాడకు వెళ్లాక తెలుసుకున్న కేసీఆర్.. బాన్సువాడ సభలో అనూహ్య వ్యాఖ్యలు చేశారు. తీవ్ర పదజాలంతో కాంగ్రెస్ నేతలను దూషించారు. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ ఈసీకి ఫిర్యాదు చేశారు. తాజాగా.. వెంకట్ కంప్లై్ంట్‌పై ఈసీ స్పందిస్తూ.. కేసీఆర్‌కు హెచ్చరిక లేఖ రాసింది.