- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఆ నాలుగు సీట్లకే కాంగ్రెస్ పరిమితం
దిశ, తెలంగణ బ్యూరో: రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలైన బీసీలను రాహుల్ అవమానించారని, వారిని ఇలాగే అవమానిస్తూ పోతే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు సీట్లకు పరిమితమవడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ అహంకారపూరితంగా మాట్లాడారని, తెలంగాణలో వెనుకబడిన వర్గాలను అవమానపరిచేలా వ్యవహరించారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న నినాదాన్ని వ్యంగ్యంగా మాట్లాడటం.. బీజేపీని విమర్శించడం కాదని, వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను అవమానించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో 2 శాతం ఓట్లు కూడా రాని బీజేపీ బీసీని సీఎం ఎట్లా చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని, బీసీలను అవమానించడమేనని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. మొన్న కేసీఆర్ కొడుకు, నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో బీసీ సీఎం కాకుండా చేస్తున్న కుట్రలో భాగంగానే ఉన్నాయని తెలిపారు. బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే బీసీలకు ఓట్లు అడగాలని ఇవాళ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. బీజేపీని విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్‌కు లేదని తెలిపారు. అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడతామంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు వింటే నవ్వొస్తోందన్నారు.
దేశాన్ని 50 ఏళ్లకుపైగా పాలించిన పార్టీ కాంగ్రెస్సే. అయినా ఏనాడూ ఓబీసీ కులగణన చేయాలనే ఆలోచన చేయని పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా? ఈ మేరకు ప్రకటన చేసే సత్తా ఉందా? కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీల పట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ వ్యక్తిని సీఎం చేస్తానని ప్రకటించాలని సవాల్ చేశారు. ఇదిలా ఉండగా బీసీలను అవమానిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను తరిమికొట్టాలని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు చేశారు. తెలంగాణలో బీసీల దమ్మేందో ఆ పార్టీలకు చూపాలని పేర్కొన్నారు. తక్షణమే బీసీలకు రాహుల్ గాంధీ, కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.