కాంగ్రెస్ పాలన అక్కడి నుంచే.. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ కౌంటర్

by GSrikanth |
కాంగ్రెస్ పాలన అక్కడి నుంచే.. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలువబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అందుకే ప్రగతి భవన్‌ను ముస్తాబు చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రగతి భవన్‌కు కొత్త రంగులు వేసే ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు స్పందించాయి. తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ సైడే ఉన్నారని, అందుకు ఎగ్జిట్ పోల్స్‌ ఏ ఊదాహరణ అని కాంగ్రెస్ శ్రేణులు ఘాటుగా స్పందించాయి.

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోసం "ప్రజా పాలన భవన్" సిద్ధమవుతోందని కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఇచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రస్తుత ప్రగతి భవన్‌కు రంగులు వేస్తున్నారని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ "ప్రజా పాలన భవన్" నుంచి ప్రజలు కోరుకున్న "ప్రజా తెలంగాణ" పాలన చేస్తారని కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులకు కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Next Story