కేసీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం

by GSrikanth |
కేసీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఈ ఇద్దరు చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తానన్నారు. శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజన్.. పరకాలలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని దొకేబాజీ పార్టీ అని నిందించారని, మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ మేనిఫెస్టోను 420 మేనిఫెస్టో అన్నారని ఈ వ్యా్ఖ్యలను వారు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మాటలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని ఇంది మంచిపద్దతి కాదన్నారు.

Advertisement

Next Story