- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్‌కు వచ్చే సీట్లు ఎన్నో తేల్చేసిన సీఎం కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ కీలక నేత భట్టి విక్రమార్కపై సీఎం కేసీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మధిర నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని సూచించారు. పట్టు లేని భట్టి విక్కమార్కకు ఓటు వేసి లాభం లేదని.. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజుకు ఓటేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో మొదటిస్థానంలో ఉందని చెప్పారు. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించిందని పేర్కొన్నారు.
చిత్తశుద్ధి, అంకితభావంతో రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని అన్నారు. అని నియోజకవర్గాల్లో సమానంగా అభివృద్ధి చెందాలనేదే తమ లక్ష్యమని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పనులు ఆగడం లేదని అన్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంకు గానే చూసిందని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అద్భుతంగా దళితబంధు అనే పథకం తీసుకొచ్చి వారి స్వశక్తి మీద ఎదిగేలా చేసేందుకు తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌లో డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారని.. అందులో ఒక్కడు కూడా గెలవడు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేవలం 20 సీట్లకే కాంగ్రెస్ పరిమితం కాబోతోందని జోస్యం చెప్పారు. సంపూర్ణ మెజార్టీతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతోందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ అంగుళాన్ని సస్యశ్యామలం చేయాలనేదే తన సంకల్పం అని చెప్పారు.