ఆటో డ్రైవర్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

by GSrikanth |
ఆటో డ్రైవర్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్యాసింజర్ ఆటో డ్రైవర్లకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఫిట్‌నెస్, పర్మిట్ ఫీజులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. సుమారు వంద కోట్లు ఖర్చు చేసి మాఫీ చేస్తామని, దీంతో లక్షలాది మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందుతారని కేసీఆర్ అన్నారు. ఇవాళ మానకొండూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ఆటో డ్రైవర్లపై వరాల జల్లు కురిపించారు.

ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు వచ్చే ఆదాయం చాలా తక్కువ అని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు పన్ను రద్దు చేశారని గుర్తుచేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డగోలుగా డీజీల్ ధరలు పెంచారని మండిపడ్డారు. మరోవైపు దేశంలో హోంగార్డులకు అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. మానకొండూరు నియోజకవర్గంలో మొత్తం దళిత కుటుంబాలకు దళిత బంధు ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story