- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాకిస్తాన్‌కు వెళ్లి ఒవైసీ ఆ మీటింగ్‌లో పాల్గొన్నారు: ప్రకాశ్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: హమాస్‌తో ఒవైసీ సంబంధాలు కొనసాగిస్తున్నారని, మన్మోహన్ సింగ్ హయాంలో ఒవైసీ పాకిస్తాన్‌కు వెళ్లి హమాస్ మీటింగ్‌లో పాల్గొన్నారా? లేదా? సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒవైసీతో సీఎం కేసీఆర్ పొత్తు పెట్టుకుని తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పరోక్షంగా కేసీఆర్ హమాస్‌కు మద్దతు ఇస్తున్నారన్నారు. కొన్ని సంస్థలు హమాస్‌కు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయని, వారికి పోలీస్ బందోబస్తు కల్పిస్తున్నారని ఆయన విమర్శలు చేశారు.
తీవ్రవాదానికి అడ్డాగా హైదరాబాద్ మారిందన్నారు. తీవ్రవాదాన్ని ఎంఐఎం ప్రోత్సహిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఒవైసీ బలోపేతానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి తీవ్రవాద సంస్థలకు రిక్రూట్ మెంట్ పెద్ద స్థాయిలో జరుగుతోందన్నారు. అందులో ఓవైసీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుత పదవిలో ఉండి సీఎం కేసీఆర్ తమ వద్ద కూడా కత్తులున్నాయని, తాము చూసుకుంటామని అనడంపై ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని, అందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు బీఆర్ఎస్ నేతలకు మాత్రమే రక్షణ కల్పిస్తారా అంటూ ఫైరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రకాశ్ రెడ్డి తెలిపారు.