ఆ రెండు జిల్లాల్లో బీఆర్ఎస్‌ ఒక్క సీటు కూడా గెలవదు: బండ్ల గణేష్

by GSrikanth |
ఆ రెండు జిల్లాల్లో బీఆర్ఎస్‌ ఒక్క సీటు కూడా గెలవదు: బండ్ల గణేష్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరవదు అని జోస్యం చెప్పారు. ఆ రెండు జిల్లాలను కాంగ్రెస్‌ పూర్తిగా కైవసం చేసుకుంటుందని అన్నారు. అంతేకాదు.. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఈ సునామీలో అన్ని పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ‘అందులో ఏ మాత్రం సందేహం లేదు. మీడియాలో కనిపించకున్నా నేను ప్రతీ రోజు పార్టీ కోసం ఏం చేయాలో అది చేస్తున్నాను. గత ఎన్నికల్లో టికెట్ కోసం ఆశించాను. ఈసారి నాకు ఇష్టమైన రేవంత్ రెడ్డి సీఎం రేసులో ఉన్నాడు. ఆయన పదవిలో కూర్చుంటే నేను అధికారాన్ని సొంతం చేసుకొన్నట్టే’ అని బండ్ల గణేష్ అన్నారు.

Advertisement

Next Story