స్టార్ క్యాంపెయినర్‌గా బండి సంజయ్.. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్కడు!

by GSrikanth |
స్టార్ క్యాంపెయినర్‌గా బండి సంజయ్.. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్కడు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: చత్తీస్ గఢ్ ఫేజ్-1 అసెంబ్లీ ఎన్నికలకు గాను స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ను పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. మొత్తం 40 మందితో కూడిన జాబితాను కమలం పార్టీ గురువారం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి స్టార్ క్యాంపెయినర్‌గా పార్టీ నియమించిన వారిలో బండి సంజయ్ ఒక్కడికి మాత్రమే చోటు కల్పించింది. కాగా, ఈ జాబితాలో ప్రధాని మోడీ, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story