- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌కు పది మంది బినామీ ఆఫీసర్లు: బక్క జడ్సన్
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేలు చేసేందుకు పది మంది ఆఫీసర్లు నిత్యం కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ చీఫ్ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం సీఈసీకి లేఖ రాశారు. ఒకే పోస్టులో మూడేళ్ల కంటే ఎక్కువగా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. బాధ్యత గల అధికారులు బీఆర్ఎస్ పక్షాన నిలుస్తూ కొనసాగడం విచిత్రంగా ఉన్నదన్నారు.
హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్, ఐటీ, ఇండస్ట్రీ కమిషనర్ జయేష్‌రంజన్, స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్, రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు, డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావుతో పాటు మరో సీనియర్ మహిళా ఆఫీసర్‌లు చట్టాన్ని ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్, కేటీఆర్‌లకు ఆర్థికంతో పాటు ఇతర విధానాల్లో మేలు చేస్తున్నారని కంప్లైంట్‌లో పొందుపరిచారు.