దయచేసి మా జీవితాలతో ఆడుకోకండి.. సర్కార్‌కు వేడుకోలు!

by GSrikanth |
దయచేసి మా జీవితాలతో ఆడుకోకండి.. సర్కార్‌కు వేడుకోలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. లక్షల్లో అప్పుచేసి ఎగ్జామ్‌లకు ప్రిపేర్ అవుతుంటే.. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్లో ఏదో ఒక గందరగోళం సృష్టించడంతో నష్టపోతున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, డీఎస్సీ నోటిఫికేషన్, పోలీస్ రిక్రూట్‌మెంట్, తాజాగా మరోసారి గ్రూపు-1 రద్దుతో నిరుద్యోగులు ఆందోళన చేందుతున్నారు. పేపర్ లికేజీతో ఒకసారి నష్ట్ర పోయమని, మరోసారి ప్రభుత్వ తప్పిదాల వల్ల నష్టాపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దౌర్భగ్యపరిస్థితి ఎందుకొచ్చిందని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఈ ఎన్నికల్లో సరైన నాయకత్వాన్ని ఎంచుకుంటామని తెలిపారు. తెలంగాణలో మద్యం నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు సరిగ్గా జరగడం లేదన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని నిరుద్యోగులు హెచ్చరించారు.

నియామకాలు సరిగా నిర్వహించడం లేదని ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. నిరుద్యోగుల ఆవేదనపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఇవాళ స్పందించింది. ఓ నిరుద్యోగమా ఇకనైనా నీ హక్కుల కోసం బయటకి రా.. కల్వకుంట్ల కుటుంబానికి ఉద్యోగం లేకుండా చేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. సీఎం కేసీఆర్‌ను దించితేనే నిరుద్యోగులకు భవిష్యత్తని, రాష్ట్రం ఏర్పడి తొమ్మిది ఏళ్ళు కావస్తున్న నిరుద్యోగ బతుకుల్లో చీకటి పోలేదని తెలిపింది. కేసీఆర్ ఉద్యోగం ఊడితేనే, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని కాంగ్రెస్ విమర్శించింది.

Advertisement

Next Story