YS షర్మిల అరెస్ట్.. SR నగర్ పీఎస్‌కు ఏపీ సీఎం జగన్!

by GSrikanth |   ( Updated:2022-11-29 10:32:29.0  )
YS షర్మిల అరెస్ట్.. SR నగర్ పీఎస్‌కు ఏపీ సీఎం జగన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నర్సంపేటలో జరిగిన దాడి ఘటన నేపథ్యంలో మంగళవారం ఆమె ప్రగతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పంజాగుట్టలో పోలీసులు అడ్డుకున్నారు. నర్సంపేట దాడిలో ధ్వంసమైన కారును సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ప్రగతి భవన్ వైపు వెళ్తున్న షర్మిలను పంజాగుట్ట చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాహనం దిగాలని పోలీసులు కోరినా ఆమె వినలేదు. డోర్ లాక్ చేసుకుని కారులోనే ఉండిపోయింది. అయితే షర్మిలకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు. దీంతో క్రేన్ తెప్పించిన పోలీసులు షర్మిల డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉండగానే క్రేన్ సాయంతో కారును ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడికి చేరుకున్న తర్వాత కూడా కార్ డోర్‌లు తీయడానికి నిరాకరించడంతో అద్ధాలను ధ్వంసం చేసిన పోలీసులు కారు తలుపులను తీసి షర్మిలను అరెస్ట్ చేశారు. అనంతరం స్టేషల్ లోపలికి తరలించారు. ఇంతలో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు, షర్మిల అభిమానులు పోలీసుల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరోవైపు రొడ్డుపై షర్మిల సృష్టించిన హంగామా కారణంగా ఆమెపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని ఆరోపిస్తూ 353, 333, 337 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. షర్మిల అరెస్ట్ నేపథ్యంలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు వైఎస్సార్ టీపీ కార్యకర్తలపై లాఠీఛార్జి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. ఆమెను పీఎస్‌లోనే ఉంచి ఇవాళ సాయంత్రం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేస్తారా? లేక మరే ఇతర చర్యలు ఉండబోతున్నాయా అనేది ఉత్కంఠ రేపుతోంది.

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు జగన్?:

షర్మిల అరెస్టు విషయం తెలుసుకున్న వైఎస్ విజయమ్మ ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు విజయమ్మను హౌస్ అరెస్ట్ చేశారు. షర్మిల అరెస్ట్ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం తన సోదరి షర్మిలను కలిసేందుకు హైదరాబాద్‌కు రాబోతున్నట్టు తెలుస్తోంది. షర్మిల అరెస్ట్‌పై వైసీపీ రియాక్ట్ అయింది. షర్మిలను అరెస్ట్ చేయడం బాధాకరమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ మహానేత రాజశేఖర్ రెడ్డి కూతురిగా, జగన్ మోహన్ రెడ్డి సోదరిగా వ్యక్తిగతంగా షర్మిల అరెస్ట్ బాధాకరమని అన్నారు. అయితే ఆమె రాజకీయ నిర్ణయాలపై స్పందించడం భావ్యం కాదన్నారు. తమది వైఎస్సార్ సీపీ పార్టీ అయితే షర్మిలది వైఎస్సార్ టీపీ పార్టీ అని అందువల్ల ఈ విషయంపై రాజకీయంగా స్పందించలేనన్నారు.

ఇవి కూడా చదవండి :

1.YS షర్మిల అరెస్ట్.. SR నగర్ పీఎస్‌కు ఏపీ సీఎం జగన్!

2.తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి : Supreme Court

Advertisement

Next Story

Most Viewed