YSRTP : ఎన్నికల్లో పోటీకి ఆ గుర్తు కోసం ఈసీకి వైఎస్సార్‌టీపీ దరఖాస్తు

by Javid Pasha |   ( Updated:2023-10-12 12:49:18.0  )
YSRTP : ఎన్నికల్లో పోటీకి ఆ గుర్తు కోసం ఈసీకి వైఎస్సార్‌టీపీ దరఖాస్తు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌లో విలీనం కుదరకపోవడంతో వైఎస్సార్‌టీపీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమవుతోంది. 119 నియోజకవర్గాల్లో పోటీ చేయనుండగా... ఆవావాహులు బీ ఫారం కోసం దరఖాస్తు చేసుకోవాలని గురువారం జరిగిన వైఎస్సార్‌టీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో షర్మిల వెల్లడించారు. ఇంతకుముందు చెప్పినట్లు పాలేరు నుంచే షర్మిల పోటీలోకి దిగనుండగా.. బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా పోటీ చేసే అవకాశముంది. మిర్యాలగూడ నుంచి విజయమ్మను బరిలోకి దింపాలని చూస్తున్నారు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌టీపీ దరఖాస్తు చేసుకుంది. రైతు నాగలి కోసం కన్ఫామ్ చేయాలని ఈసీకి దరఖాస్తు పంపింది. ఎన్నికల్లో కొత్తగా పోటీ చేయబోయే పార్టీలకు త్వరలోనే ఈసీ గుర్తులను కేటాయించనుంది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఈసీ.. ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. అధికారులను బదిలీ చేయడంతో పాటు వాహనాల తనిఖీలను కూడా షురూ చేసింది.

నవంబర్‌లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనుండగా.. అనంతరం కొత్తగా పోటీ చేసే పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈసీ గుర్తులు కేటాయించనుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత వైఎస్సార్‌టీపీకి గుర్తు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో వైఎస్సార్‌టీపీకి ఈసీ గుర్తు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed