- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Sharmila: 'ఆ మాట అనడానికి సిగ్గనిపించడం లేదా?'.. కేటీఆర్ వ్యాఖ్యలపై షర్మిల ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్‌వి పిట్టల దొర ముచ్చట్లు అయితే కొడుకు కేటీఆర్ వి కల్లబొల్లి, డొల్ల మాటలు అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుదని కేసీఆర్ నాడు రెచ్చగొట్టి నిరుద్యోగుల ప్రాణం తీస్తే.. చదువుకున్నోళ్లందరికీ సర్కారు కొలువులు ఇవ్వలేమని కేటీఆర్ చేతులెత్తేసి నిరుద్యోగులకు శఠగోపం పెట్టాడని విమర్శించారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ కుటుంబానికి పదవులు పోతే ఆగమేఘాల మీద మళ్లీ పదవులు తెచ్చుకోవచ్చు కానీ అదే స్వరాష్ట్రం కోసం కొట్లాడిన నిరుద్యోగులు మాత్రం తొమ్మిదేండ్లుగా కొలువులు లేక ఆకలితో అలమటించాలా అని ప్రశ్నించారు. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి అధికారం అనుభవిస్తూ.. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేం అంటూ చావు కబురు చల్లగా చెప్పేందుకు సిగ్గనిపించడం లేదా కేటీఆర్ అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు కనీసం స్వయం ఉపాధి కల్పించలేని దరిద్రపు పాలన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానిదని, తొమ్మిదేండ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల ఉసురు తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని తన్ని తరిమే రోజులు దగ్గర పడ్డాయన్నారు.
Also Read..