YS Viveka Case : నేడు సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణ.. తీవ్ర ఉత్కంఠ

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-24 11:47:37.0  )
YS Viveka Case : నేడు సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణ.. తీవ్ర ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సునీతారెడ్డి పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. శుక్రవారం సునీత పిటిషన్ పై విచారించిన సీజేఐ ధర్మాసనం అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై కీలక ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ హై కోర్టు ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వడం సంచలనంగా మారింది.

ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తే సీబీఐ అరెస్ట్ చేస్తుందని అవినాష్ రెడ్డి న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూనే, సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టే వరకు అవినాష్ రెడ్డని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. అయితే ఆదివారం కడపలోని వైఎస్ వివేకా ఇంటిని సీబీఐ అధికారులు పరిశీలించారు. అనంతరం వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. వివేకా వద్ద టైపిస్ట్ గా పని చేసిన ఇనాయతుల్లాను సీబీఐ అధికారులు విచారించారు. తాజా పరిణామాలతో నేడు సుప్రీం కోర్టులో ఏం జరగబోతోందో అనే టెన్షన్ నెలకొంది.

Also Read..

Viveka Case: కీలక పరిణామం.. సీబీఐ కార్యాలయానికి వివేకా హత్య నాటి ఎస్పీ రాహుల్ దేవ్

Advertisement

Next Story

Most Viewed