- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CPM కార్యాలయంలోనే వామపక్షాలపై YS షర్మిల సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె వామపక్షాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్‌కు వామపక్షాలు బీ-టీమ్‌లాగా పనిచేశారని తమ్మినేని సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై వామపక్షాలు పోరాటం చేయడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వానిక వ్యతిరేకంగా చేసే పోరాటంలో కలిసి రావాలని వామపక్షాలు తనను ఎప్పుడైనా కోరారా..? కనీసం ఫోన్ చేసి అయిన పిలిచారా అని షర్మిల ప్రశ్నించారు. రాజకీయాలు పక్కనపెట్టి నిరుద్యోగుల భవిష్యత్ కోసం అన్ని పార్టీలు కలిసి పని చేయాలని షర్మిల కోరారు. మునుగోడు ఉపఎన్నికలో వామపక్షాలు బీఆర్ఎస్‌కు బీ- టీమ్‌గా పనిచేశాయని స్వయంగా సీపీఎం కార్యాలయంలోనే షర్మిల వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది.
Read More: షర్మిల అలా మాట్లాడటం కరెక్ట్ కాదు: తమ్మినేని వీరభద్రం ఆగ్రహం