కేసీఆర్ ఓటమికి నేనే కారణం: YS షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-01-21 14:24:11.0  )
కేసీఆర్ ఓటమికి నేనే కారణం: YS షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఓ నియంతను గద్దె దింపామని ఇన్ డైరెక్ట్‌గా మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. తాను చేసిన త్యాగంతోనే తెలంగాణలో అక్కడ నియంత అధికారం కోల్పోయారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను ఎవరో వదిలిన బాణం కాదని పరోక్షంగా సోదరుడు, సీఎం జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తే.. నియంతలే అధికారంలో ఉంటారన్నారు. నా పుట్టినిల్లు ఏపీ అయితే.. మెట్టినిల్లు తెలంగాణ అని షర్మిల స్పష్టం చేశారు. నా గురించి ఎవరూ ఎక్కువ భయపడితే వారే నాపై ఎక్కువగా దాడి చేస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story