- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS నాయకుల ఆగడాలపై చర్యలు తీసుకోండి: షర్మిల
దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, బీఆర్ఎస్ నేతలు మహిళల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై రాష్ట్ర మహిళా కమిషన్ కు షర్మిల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో మంత్రులు నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లను కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల రాష్ట్రంలో మహిళల పట్ల బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల దాడులు జరుగుతుంటే బీఆఆర్ఎస్ మహిళా నేతలు మౌనం వహిస్తున్నారని రాష్ట్రంలో మహిళ కమిషన్ ఉండి ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. సాక్షాత్తు గవర్నర్ ను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, పాదయాత్రలో తాను కేసీఆర్ సర్కార్ ను ప్రశ్నిస్తుంటే తనను నానా మాటలు అంటున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేతలు నన్ను దూషిస్తేనే తాను ఎదురుమాట్లాడానని చాలా మంది మంత్రులు తనను వ్యక్తిగతంగా దూషించారన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తననే కాదని ఇతర మహిళలను కూడా అవమానించాడని, స్వయంగా ఒక ఐఏఎస్ మహిళ అధికారి చెయ్యి పట్టుకున్నాడని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న వాళ్ళ భార్య బిడ్డలు ఏమైనా చేయొచ్చా? స్వయంగా సీఎం కేసీఆర్ బిడ్డ లిక్కర్ స్కామ్ లో ఉంది. శంకర్ నాయక్ భార్య ఏకంగా భూ కబ్జాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అధికారంలో ఉండి మీరు ఏమైనా అనొచ్చు కానీ మేము మిమ్మల్ని ప్రశ్నించకూడదా అని నిలదీశారు. తాము ఎక్కడ కూడా రెచ్చగొట్టే వాఖ్యలు చేయలేదని చెప్పారు.
ఫిర్యాదు చేద్దామని వస్తే మహిళా కమిషన్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మమ్మల్ని కావాలనే మహిళా కమిషన్ కలవలేదు. తనపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన వారిపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోకపోతే జాతీయ మహిళా కమిషన్ ను సైతం ఆశ్రయిస్తామన్నారు. కేసీఅర్ కు అసలు మహిళల మీద గౌరవం లేదని నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే నాలుగేళ్లుగా మహిళా కమిషన్ ను ఎందుకు పెండింగ్ లో పెట్టారని ప్రశ్నించారు. శ్రీకాంత్ చారి తల్లి ఓడిపోతే కనీసం పట్టించుకోని కేసీఆర్ అదే తన బిడ్డ ఓడిపోతే మాత్రం మళ్లీ పదవి ఇచ్చాడని ధ్వజమెత్తారు. పాదయాత్రపై కోర్టుకు వెళ్తామని పర్మిషన్ వచ్చాక పాదయాత్ర మొదలుపెడతానని చెప్పారు.