- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీ బయటైనా నాకు ఓకే.. సీఎం కేసీఆర్‌కు షర్మిల సవాల్
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ''ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి, అక్రమాలను ఎండగడతాం. ప్రజాప్రస్థానం ప్రజల కోసమే చేపట్టిన పాదయాత్ర. ప్రజల తరుఫున పోరాడుతున్న YSR బిడ్డను ఎంక్వైరీకి పిలుస్తారట. మీకు దమ్ముంటే ఎంక్వైరీ చేయండి. దేనికైనా నేను రెడీ. అసెంబ్లీకి రమ్మన్నా వస్తా.. అసెంబ్లీ బయటైనా సరే చర్చించడానికి సిద్ధం. మీ అవినీతి, అక్రమాలపై విచారణ చేయిస్తే ఎదుర్కునే దమ్ము KCRకు, MLAలకు ఉందా? బేడీలకు భయపడం.. బెదిరింపులకు బెదరం.. అరెస్టులకు అంతకన్నా తలొగ్గం.. వైఎస్ఆర్ గారిని కుట్ర చేసి చంపారు. నన్ను కూడా చంపగలరు. కానీ, నాలో ఊపిరి ఉన్నంత వరకు ప్రజల నుంచి వేరు చేయలేరు.'' అంటూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
బేడీలకు భయపడం.. బెదిరింపులకు బెదరం.. అరెస్టులకు అంతకన్నా తలొగ్గం.. వైఎస్ఆర్ గారిని కుట్ర చేసి చంపారు. నన్ను కూడా చంపగలరు. కానీ నాలో ఊపిరి ఉన్నంత వరకు ప్రజల నుంచి వేరు చేయలేరు.#PrajaPrasthanam pic.twitter.com/rNmIRgL5aG
— YS Sharmila (@realyssharmila) September 18, 2022