- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన YS షర్మిల
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ ప్రజల ఎక్సాక్ట్ పల్స్ కావాలని కోరుకుంటున్నానని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రేపటితో కేసీఆర్ అవినీతి, అక్రమ, నియంతృత్వ పాలన పోవాలని ఆమె కోరుకున్నారు. ఇవాళ షర్మిల లోటస్ పాండ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ఎలాంటి జిమ్మిక్కులకు పాల్పడకుండా ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును పాటించాలని సూచించారు. ఈసారి కేసీఆర్ నైజమైన ఎమ్మెల్యేలను కొనడం, బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేయొద్దని.. ఫలితాల తర్వాత ప్రజల రిఫరెండంగా భావించి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
10 ఏండ్లలో ప్రజలన మోసం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చని అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. రేపు తెలంగాణకు మరో విమోచన దినోత్సవం కావాలని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ పెట్టిన మొదటి నుంచి కేసీఆర్ అవినీతి, నియంతృత్వ పాలనపై పోరాడానని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కేసీఆర్ గెలిచే అవకాశం ఉందనే మేము ఎన్నికల బరిలో నుంచి పూర్తిగా తప్పుకున్నామని తెలిపారు. ఈ నిర్ణయం తనకు పొలిటికల్ సూసైడ్ అవుతుంది అని తెలిసి కూడా ప్రజల కోసం మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. మాకు కేసీఆర్‌ను కొట్టే అవకాశం రాకపోయినా కాంగ్రెస్‌కు వచ్చిన అవకాశం కోసం నా పూర్తి మద్దతు ఇచ్చానని తెలిపారు.
తాను కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసినప్పుడు.. మా పార్టీ వాళ్ళు కూడా నాపై తిరుగుబాటు చేశారు, దూషించారు.. నేను భరించాను.. కానీ కేసీఆర్ పాలన నచ్చక వైఎస్సార్టీపీలోకి వచ్చి పోటీ చేయడం లేదనగానే మళ్ళీ ఆయన వద్దకే ఎలా వెళ్లారు.. మీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్యాకప్ చేసుకునే టైం వచ్చింది.. చివరగా ఆయనకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నామన్నారు. ‘‘తెలంగాణ పీపుల్ సే బై బై కేసీఆర్’’ అనే పేరిట సూట్ కేసు సీఎం కేసీఆర్‌కు షర్మిల పంపించారు.