- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రవల్లిక ఆత్మహత్యపై స్పందించిన వైఎస్ షర్మిల.. మంత్రి కేటీఆర్‌కు సూటి ప్రశ్నలు
దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదా వేశారనే ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డ హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌కు చెందిన ప్రవల్లిక ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ప్రవల్లిక ఆత్మహత్య ఘటనపై రాజకీయ పార్టీల నేతలందరూ స్పందిస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రవల్లిక ఆత్మహత్య ఘటనపై నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఇది కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రవల్లిక ఆత్మహత్యపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. తల్లిదండ్రుల ఉసురు కేసీఆర్‌కు తగులుతుందని, ఇది కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యేనని విమర్శించారు. ప్రవల్లిక నష్టజాతకురాలు కాదని, అధికారంలో ఉండి నిరుద్యోగుల కోసం ఏమీ చేయలేని పాలకులు నష్ట జాతకులని దుయ్యబట్టారు. నోటిఫికేషన్లు ఇవ్వడం, పరీక్షలు నిర్వహించడం చేతకాని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలనేది నిరుద్యోగులు ఆలోచించాలని షర్మిల సూచించారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్లు అమ్ముకున్నందుకు ఓటేయాలా? పేపర్ లీక్‌లు చేసినందుకా? అని షర్మిల ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే... కేసీఆర్‌ను చూసి ఓటేయాలని కేటీఆర్ ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని షర్మిల ఆరోపించారు.