దళితబంధు అక్రమాలు వెలుగులోకి తెస్తే దాడులా?

by GSrikanth |   ( Updated:2023-05-21 10:02:54.0  )
దళితబంధు అక్రమాలు వెలుగులోకి తెస్తే దాడులా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళితబంధు అక్రమాలను ఎత్తిచూపిన అడ్వకేట్ యుగేందర్‌పై బీఆర్ఎస్ గూండాలు దాడికి దిగారని, దీన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ‘బీఆర్ఎస్’ అంటే ‘బందిపోట్ల రాష్ట్ర సమితి’ అని తాము ఊరికే అనడంలేదని ఆమె విమర్శలు చేశారు. నడిరోడ్డుపై దళిత న్యాయవాది కారు అద్దాలు పగలగొట్టి, రక్తమోడేలా దాడి చేసి చంపేస్తామంటూ బెదిరించడం బంధిపోట్లకే సాధ్యమని మండిపడ్డారు. దళితులపై జరుగుతున్న అన్యాయంపై, దళితుల న్యాయమైన హక్కుల కోసం తమ పార్టీ పోరాడుతోందని ఆమె పేర్కొన్నారు.

బందిపోట్ల రాష్ట్ర సమితి అంటే తనపై హుటాహుటిన కేసు నమోదు చేయించిన సీఎం కేసీఆర్, దళిత న్యాయవాదిపై దాడికి దిగిన బీఆర్ఎస్ బందిపోట్లకు మాత్రం గొడుగు పడుతున్నారని షర్మిల విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి నుంచి దళితబంధు వరకు అన్ని రకాలుగా వారిని మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని ఆమె ఘాటుగా స్పందించారు. కేసీఆర్ సొంత రాజ్యాంగంలో ప్రతిపక్షాలకు పోరాడే హక్కు లేదని, మీడియాకు ప్రశ్నించే స్వేచ్ఛ లేకుండాపోయిందన్నారు. అందుకే టీఆర్ఎస్ అంటే తాలిబన్ల రాష్ట్ర సమితి అని, బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని అంటున్నామని షర్మిల పేర్కొన్నారు.

Also Read...

బ్రేకింగ్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కిషన్ రెడ్డి క్లారిటీ

Advertisement

Next Story

Most Viewed