బీఆర్ఎస్ అంటే.. బీజేపీకి రహస్య సమితి: షర్మిల

by GSrikanth |   ( Updated:2023-07-06 17:08:53.0  )
బీఆర్ఎస్ అంటే.. బీజేపీకి రహస్య సమితి: షర్మిల
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అంటే ‘బీజేపీకి రహస్య సమితి’ అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ బరాబర్ బీజేపీకి ‘బీ’టీం అని స్పష్టం చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో లేని బీజేపీని పైకిలేపి, ఇన్నాళ్లూ విమర్శలు గుప్పించిన కేసీఆర్.. కొడుకు, కూతురు కేసులతో కథ అడ్డం తిరిగే సరికి బీజేపీతో జతకట్టాడని విమర్శించారు. అందుకే కేసీఆర్.. బీజేపీకి బీటీమ్‌గా మారాడని ఆమె ఆరోపించారు. బీజేపీతో కేసీఆర్ చేస్తున్నది సమరం కాదు.. వ్యభిచారం అని కీలక వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేళ్లుగా ఏనాడూ విభజన హామీలపై బీజేపీని కేసీఆర్ ప్రశ్నించలేదని అన్నారు.

Advertisement

Next Story