- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గజ్వేల్ ఓటర్లు తరిమేస్తారని దొరకు అర్థమైంది: YS షర్మిల సెటైర్
దిశ, డైనమిక్ బ్యూరో: గజ్వేల్ ఓటర్లు తన్ని తరిమేస్తారని దొరకు బాగా అర్థమైనట్టుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. అందుకే ముందు జాగ్రత్తగా రెండో స్థానం నుంచి పోటీ చేస్తున్నారని ఇవాళ ట్విట్టర్ వేదికగా తెలిపారు. స్వయానా ముఖ్యమంత్రికే సొంత నియోజకవర్గంలో గెలుస్తాననే దమ్ము లేకపోవడం కేసీఆర్ పదేళ్ల దిక్కుమాలిన పరిపాలనకు నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనడానికి సంకేతమన్నారు.
దొర ఇన్నాళ్లు గజ్వేల్ ప్రజలను కలిసింది లేదని, వాళ్ళ గోసలు తెలుసుకున్నది లేదన్నారు. పేరుకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా డబుల్ బెడ్ రూం, దళిత బంధు రాలేదన్నారు. ఇక దొర గజ్వేల్‌లో చూపెట్టే అభివృద్ధి అంతా ఖాళీ బిల్డింగులే అని, రాష్ట్రానికే ముఖ్యమంత్రిని అన్న అహంకారంలో కేసీఆర్ గజ్వేల్‌కి ఎమ్మెల్యే అన్న సంగతి ఏనాడో మరిచిపోయాడని విమర్శించారు. నిజంగా దమ్ముంటే కేసీఆర్.. తన పరిపాలన మీద తనకు నమ్మకం ఉంటే.. సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే గెలిచి చూపించాలని సవాల్ చేశారు.